ఇరాన్​ పెట్రో ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు

By udayam on October 1st / 6:29 am IST

యూఎస్ ట్రెజరీ విభాగానికి చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్ కంట్రోల్ (ఒఫాక్ ) ఇరాన్ పెట్రో, పెట్రో కెమికల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థల పై ఆంక్షలను విధించింది. ఇందులో కొన్ని భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలు ఉత్పత్తులను దక్షిణ, తూర్పు ఆసియాలో విక్రయిస్తున్నాయి. ఇరాన్ పెట్రో ఉత్పత్తులకు రవాణా సౌకర్యాలు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్న యూఏఈ, హాంగ్ కాంగ్, ఇండియాలో ఉన్న ప్రధాన సంస్థలు, ఇరాన్ కు చెందిన మధ్యవర్తి సంస్థలుపై ఒఫాక్ ఆంక్షలను విధించింది.

ట్యాగ్స్​