అశ్విన్​ మాయ.. సిరీస్​ భారత్​ వశం

By udayam on December 26th / 5:53 am IST

రవిచంద్రన్‌ అశ్విన్‌ (42 నాటౌట్‌, 62 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (29 నాటౌట్‌, 46 బంతుల్లో 4 ఫోర్లు) అసమాన ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల ఛేదనలో 74 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్‌ పరాజయం ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో భారత్‌ ఓటమి తప్పించుకోవటం అసాధ్యమే అనిపించింది. అశ్విన్‌, అయ్యర్‌ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 71 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఈ రెండు మ్యాచ్​ ల టెస్ట్​ సిరీస్​ ను భారత్​ 2–0 తో బంగ్లాను వైట్​ వాష్​ చేసింది.

ట్యాగ్స్​