తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ విజయం

By udayam on January 11th / 4:54 am IST

శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్​ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్​ పై టాస్​ ఓడి బ్యాటింగ్​ కు దిగిన భారత్ కు బ్యాటర్లు రోహిత్​ శర్మ 83, శుభ్​ మన్​ గిల్​ 70, కోహ్లీ 113 పరుగులు చేసి జట్టుకు 373 పరుగుల భారీ స్కోరును అందించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలో దిగిన శ్రీలంక బ్యాటర్లు 50 ఓవర్లలో 306 పరుగులు చేశారు. ఈ క్రమంలో 8 వికెట్లు కోల్పోయింది. శనక 88 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్‌లో 108 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మొహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. షమీ, హార్దిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్​