కొత్త ఏడాది భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో నిన్న ప్రారంభమైన తొలి టి20 మ్యాచ్ లో చివరి బంతికి 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు దీపక్ హుడా 41, ఇషాన్ కిషన్ 37, అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడంతో 162 పరుగులు చేసింది. ఆపై శ్రీలంక బ్యాటర్లు బ్యట్ ఝులిపించడంతో ఓ దశలో భారత్ ఓటమి దిశగా ప్రయాణించింది. అయితే చివరి ఓవర్లో అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక 160 పరుగులకు సరిపెట్టుకుంది.భారత్ బౌలర్లలో మావి 4, ఉమ్రాన్ 2, హర్షల్ 2 వికెట్లు తీశారు.