ఇంగ్లాండ్​పై తొలి టెస్ట్​ విజయానికి 50 ఏళ్ళు

By udayam on August 24th / 6:56 am IST

ఇంగ్లాండ్​పై భారత్​ సాధించిన తొలి టెస్ట్​ విజయానికి నేటితో 5‌‌0 ఏళ్ళు పూర్తయ్యాయి. ఓవల్​ మైదానంలో 1971 ఆగస్ట్​ 24న అజిత్​ వాడేకర్​ నేతృత్వంలోని భారత బృందం దుర్భేధ్యమైన ఇంగ్లాండ్​ జట్టును మట్టికరిపించింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన మ్యాచుల్ని కూడా గెలిచి తొలిసారిగా ఇంగ్లాండ్​పై టెస్ట్​ సిరీస్​ను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ టెస్ట్​ ఓడిపోవడానికి ముందు ఇంగ్లాండ్​ వరుసగా 3 ఏళ్ళ పాటు 19 టెస్టుల్లో ఓటమనేదే లేకుండా కొనసాగుతోంది.

ట్యాగ్స్​