రెండో వన్డే: సిరీస్​ పట్టేస్తారా?

By udayam on January 12th / 5:58 am IST

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఈరోజు లంకేయులతో రెండో వన్డేకు సిద్ధమవుతోంది. కలకత్తా వేదికగా జరిగే ఈ వన్డే లో గెలిచి ఈ సిరీస్​ ను దక్కించుకోవాలని రోహిత్​ సేన ప్రాక్టీస్​ ను ముమ్మరంగా చేస్తోంది. సీనియర్​ బ్యాటర్లు రోహిత్​, కోహ్లీతో పాటు గిల్​, శ్రేయస్​ అయ్యర్​, అక్షర్​ పటేల్​ లు ఫామ్​ కొనసాగిస్తుండడం భారత్​ కు కలిసి వచ్చే అంశం. మరో వైపు జమ్మూ ఎక్స్​ ప్రెస్​ ఉమ్రాన్​ మాలిక్​ వేగానికి, సిరాజ్​, షమిల లైన్​ అండ్​ లెంగ్త్​ తోడైతే ఈ రోజు మ్యాచ్​ లో భారత్​ విజయాన్ని ఆపడం లంక తరం కాదు.

ట్యాగ్స్​