ఎయిర్​ పోర్ట్​ చెకింగ్స్​ లో 11 కరోనా వేరియంట్లు

By udayam on January 6th / 1:24 pm IST

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 వేగంగా వ్యాపించే సామర్థ్యం గలదన్న నేపథ్యంలో ఇటీవల భారత్ లో కరోనా శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. డిసెంబరు 24 నుంచి జనవరి 3వ తేదీ మధ్యన విదేశాల నుంచి 9.05 లక్షల మంది భారత్ చేరుకోగా, వారిలో 19,227 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 124 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ట్యాగ్స్​