భారత్​లో ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్​

By udayam on June 3rd / 12:29 pm IST

ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్​ నిర్మాణానికి భారత్​ సిద్ధమవుతోంది. లిక్విడ్​ మిర్రర్​ టెక్నాలజీని ఉపయోగించి ఈ టెలిస్కోప్​ను సిద్ధం చేయాలని ఆర్యభట్ట రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అబ్జర్వేషనల్​ సైన్సెస్​ సంస్థ ప్రకటించింది. దీనిని ఉత్తరాఖండ్​లోని దేవస్థల్​ వద్ద 2450 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని సాయంతో సూపర్​ నోవాస్​, గ్రావిటేషనల్​ లెన్సెస్​, అంతరిక్ష వ్యర్థాలు, గ్రహశకలాలను ట్రాక్​ చేయొచ్చని ప్రొఫెసర్​ దీపాంకర్​ బెనర్జీ తెలిపారు.

ట్యాగ్స్​