జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన కరోనా వ్యాక్సినేషన్ 34 రోజుల వ్యవధిలో 1 కోటి మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకుంది.
దీంతో అమెరికా తర్వాత అత్యంత వేగంగా 10 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
రోజుకు 40 వేల నుంచి 50 వేల మందికి వ్యాక్సినేషన్ జరిగేలా భారత్ మాస్ వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రెండో విడత కరోనా డోస్‌ను సైతం మొదలు పెట్టి ముందుగా హెల్త్ వర్కర్లు, శానిటైజేషన్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను ఇస్తున్న విషయం తెలిసిందే.