మోదీ: 100 దేశాల నుంచి పెట్టుబడులొచ్చాయ్​

By udayam on June 3rd / 11:09 am IST

గడిచిన ఆర్దిక సంవత్సరంలో భారత స్టార్టప్​ కంపెనీలకు 100 దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రారంభమైన ఉత్తరప్రదేశ్​ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో 84 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు భారత స్టార్టప్ లు సాధించాయని హర్షం వ్యక్తం చేశారు. ‘భారత సత్తా ఏంటన్నది ప్రపంచం నోరెళ్ళబెట్టి చూస్తోంది. జి20 దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుదేలవుతున్న నేటి ప్రపంచంలో భారత్​ దూసుకుపోతోంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్​