దేశంలో ఉత్పత్తమవుతున్న పంచదారను ఎగుమతి చేయడంపై కేంద్రం ఈరోజు నిషేధం విధించింది. గత వారం గోధుమల ఎగుమతిని నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెరనూ నిషేధిత జాబితాలోకి చేర్చింది. జూన్ 1 నుంచి ఈ చక్కెర ఎగుమతుల నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. దేశీయ మార్కెట్లో దీని రేటు పెరగకుండా చూడడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే సీఎక్స్ఎల్, టీఆర్క్యూల రూపంలో యూరోపియన్ యూనియన్, అమెరికాలకు ఎగుమతులు కొనసాగుతాయి.