సమితి: వేగవంతమైన వృద్ధి రేటు భారత్​దే

By udayam on May 19th / 7:32 am IST

2022 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక జిడిపి నమోదు చేసే దేశంగా భారత్​ నిలవనుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్​దే అగ్రస్థానమని చెప్పింది. ‘2021లో 8.8 గా ఉన్న భారత వృద్ధి రేటు 2022లో 6.4 శాతానికి తగ్గుతుంది. అయినా ప్రపంచంలో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేస్తున్న దేశం భారత్​నే’ అని వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.1 శాతంగా ఉంటుందని తెలిపింది. దీనిని గతంలో యుఎన్​ 4.0 శాతంగా అంచనా వేసి ఇప్పుడు తగ్గించింది.

ట్యాగ్స్​