ఫాస్ట్​ బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ తండ్రి మృతి

By udayam on November 20th / 2:53 pm IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఫాస్ట్​బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సిరాజ్​ తండ్రి మహ్మద్​ గౌస్​ (53) ఈరోజు హైదరాబాద్​లో మృతి చెందారు.

సిడ్నీలో ప్రాక్టీస్​ సెషన్​ పూర్తి చేసుకున్న అనంతరం సిరాజ్​కు ఈ విషయం తెలియడంతో అక్కడే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది.

‘‘దేశానికి గర్వకారణంగా బతుకు అని మా నాన్న నాకెప్పుడూ చెప్పేవాడు. ఆయన ఆటో నడుపుతూ కూడా నన్ను మాత్రం నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్​ కోచింగ్​కు పంపేవాడు” అని సిరాజ్​ పేర్కొన్నాడు.

‘‘ఇది నిజంగా నేను ఊహించనిది. నాకున్న అతి పెద్ద సపోర్ట్​ మా నాన్న. నేను దేశం తరపున ఆడడం ఆయన కల. ఆయన కల నేర్చావననే అనుకుంటున్నా’’ అని సిరాజ్​ పేర్కొన్నారు.