దేశంలో 119 రోజుల తర్వాత ఒకరోజు అత్యధిక కేసులు గురువారం నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,313 మంది కరోనా బారిన పడ్డారు. కేరళలో అత్యధికంగా 4,224 కేసులు రాగా, మహారాష్ట్రలో 3,260, ఢిల్లీలో 928, హర్యానాలో 527, కర్ణాటకలో 676, తమిళనాడులో 771, ఉత్తర ప్రదేశ్లో 678 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్యా భారీగానే నమోదైంది. 24 గంటల్లో కరోనాతో 38 మంది మరణించారు. కేరళలలోనే 20 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 83,990కు చేరింది.