థామస్ కప్ బ్యాడ్మింటన్ పోటీలో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాకు ఝలక్ ఇస్తూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారిగా ఈ ఛాంపియన్‌షిప్‌ను మన దేశం గెలుచుకున్నట్లయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్ళకు ఫోన్ చేసి అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్లేయర్లకు రూ.1 కోటి నజరానా ప్రకటించారు. ఈ విజయాన్ని సునీల్ గవాస్కర్ భారత్ 1983లో గెలిచిన వరల్డ్ కప్‌తో పోల్చారు.