భారత్లో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,712 కేసులు వచ్చాయి. బుధవారం ఈ కేసుల సంఖ్య 2,745గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యి కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. గతంలో మే 9న 3,207 కేసులు రాగా ఆ తర్వాత కాస్త నెమ్మదించాయి. మళ్ళీ 3 వారాల తర్వాత మరోసారి మూడు వేలకు పైగా కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,509గా ఉంది.