రెండు రోజుల క్రితం లడఖ్ వద్ద భారత్ భూభాగంలోకి వచ్చిన చైనా సైనికుడ్ని అదుపులోకి తీసుకున్న మన సైన్యం.. తిరిగి ఈరోజు చైనాకు అప్పగించింది.
దట్టమైన చీకటి, పరిసరాల పట్ల అవగాహన లేకే తమ సైనికుడు భారత్ వైపు వెళ్ళాడని, అతడిని వెంటనే తమకు అప్పగించాలంటూ ఇదివరకే చైనా భారత్కు విజ్ఞప్తి చేసింది.
దీంతో లడఖ్ కు సమీపంలోని చుషుల్ – మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద భారత సైన్యం అతడిని చైనా అధికారులకు అప్పగించింది.
ఇతడితో కలిపి గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ భారత్ ఇద్దరు చైనా సైనికులను అదుపులోకి తీసుకుని తిరిగి చైనాకు అప్పగించింది.