సివిల్ వార్ గుప్పిట్లో చిక్కుకున్న శ్రీలంకకు తమ సైన్యాన్ని పంపే ఉద్దేశ్యం లేదని భారత్ స్పష్టం చేసింది. శ్రీలంకలో ప్రజాస్వామ్యానికి భారత్ బలమైన మద్దతుదారుగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది. శ్రీలంకను బలమైన ప్రజాస్వామ్య, ఆర్ధిక దేశంగా ఎదిగేలా చేయడమే భారత మిషన్ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమైన నేపధ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.