శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 373 పరుగుల వద్ద ముగించింది. విరాట్ కోహ్లీ 113, రోహిత్ శర్మ 83, శుభ్ మన్ గిల్ 70, కెఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు. ఓపెనర్లు రోహిత్, గిల్ లు తొలి వికెట్ కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై గిల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ఓ రేంజ్ లో ఆడుకున్న అతడు వచ్చిన జీవన దానాలను సద్వినియోగం చేసుకుంటూ సెంచరీని నమోదు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు.