క్రికెట్​కు ఆల్​రౌండర్​ రుమేలీ రిటైర్మెంట్​

By udayam on June 22nd / 12:46 pm IST

టీమిండియా మహిళా సీనియర్​ క్రికెటర్​ రుమేలీ ధార్​ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​ బై చెప్పేసింది. 2005 మహిళల వన్డే ప్రపంచకప్​లో ఫైనల్​ చేరిన భారత జట్టులో రుమేలీ మెంబర్​. 19 ఏళ్ళ తన సుదీర్ఘ కెరీర్​ నేటితో ముగిసిందన్న ఆమె.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్​ ఇస్తున్నట్లు పేర్కొంది. 2003లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రుమేలీ చివరి మ్యాచ్​లో 2018లో ఆడింది. 78 వన్డేల్లో 961 పరుగులతో పాటు 63 వికెట్లు, 4 టెస్టుల్లో 236 పరుగులు, 8 వికెట్లు తీసింది. 18 టి20ల్లో 131 పరుగులు, 13 వికెట్లు తీసింది.

ట్యాగ్స్​