దాదాపు 16 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారం, మందులను భారత్.. శ్రీలంకకు పంపించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలను కాపాడుకునేందుకు భారత్ ఈ భారీ షిప్మెంట్ను తరలించింది. శ్రీలంకలోని భారత రాయబారి గోపాల్ బాగ్లే ఈ విషయాన్ని వెల్లడించారు. వీటితో పాటు తమిళనాడు ప్రభుత్వం సైతం 5.6 మిలియన్లు విలువ చేసే బియ్యం, పాల పౌడర్, మందులను సైతం శ్రీలంకకు పంపినట్లు ఆయన వెల్లడించారు.