ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో 8 కోట్ల 5జి ఫోన్లు అమ్మకాలు జరుగుతాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ బయటపెట్టింది. ఆగస్ట్ నుంచి దేశంలో 5జి సేవలు ప్రారంభం కానున్న వేళ 5జి హ్యాండ్సెట్ల అమ్మకాల్లో జోరు కనిపిస్తుందనిపేర్కొంది. కనీసం రూ.10 వేల నుంచే 5జి హ్యాండ్సెట్లు అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని, కంపెనీలు ఈ మేరకు తమ ఉత్పత్తుల్ని అప్‌గ్రేడ్ చేస్తున్నాయని తెలిపింది.