భారత్ నుంచి శ్రీలంకకు ప్రయాణికులతో వెళ్ళే ఫెర్రీ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో పుదుచ్చేరి, జాఫ్నా మధ్య ఈ సర్వీసుల్ని తిరిగి ప్రారంభించడానికి భారత్, శ్రీలంక దేశాలు అంగీకరించాయి. జాఫ్నా ద్వీపంలో భారీ సంఖ్యలో భారతీయ పౌరులు వ్యాపారాలు చేస్తుంటే.. శ్రీలంక నుంచి భారతదేశానికి వెళ్లే బౌద్ధ యాత్రికులకు కూడా ఈ సర్వీసెస్ చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. మనిషికి రూ.5 వేల టికెట్ తో ఈ సర్వీస్ నడపనున్నారు. ఒకేసారి ఫెర్రీలో 400–600 ల మంది ప్రయాణించవచ్చు.