పృధ్వీ–2 క్షిపణి పరీక్ష విజయవంతం

By udayam on January 11th / 6:43 am IST

దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. పృథ్వీ సిరీస్‌లో రూపొందించిన ఈ బాలిస్టిక్‌ మిస్సైల్‌తో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరిందని పేర్కొంది. పృథ్వీ-2 క్షిపణి యొక్క స్ట్రైక్ రేంజ్ దాదాపు 350 కిలో మీటర్లు. పృథ్వీ-2 క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఉపరితలం నుండి ఉపరితలం పై ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి.

ట్యాగ్స్​