విజయవంతంగా అగ్ని–3 క్షిపణి ప్రయోగం

By udayam on November 24th / 10:02 am IST

భారత్​ తన అమ్ముల పొదిలోని అత్యంత అధునాతన అగ్ని–3 మధ్యంతర శ్రేణి క్షిపణిని ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్షను నిర్వహించినట్లు డిఆర్​డిఓ వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్లు వెల్లడించారు. అగ్ని-3 క్షిపణి శ్రేణిలో ఇంతకుముందు 2006 జూన్​ 9న మొదటిసారి ప్రయోగించగా.. అప్పుడు విఫలమైంది. ఆపై 2007లో రెండో సారి, 2008లో మూడోసారి విజయవంతంగా ఈ క్షిపణిని ప్రయోగించారు.

ట్యాగ్స్​