గురువారం నాటికి 100 కోట్ల వ్యాక్సిన్లు!

By udayam on October 12th / 7:06 pm IST

దేశంలో మరో రెండు రోజుల్లో 100 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్ల పంపిణీని పూర్తి చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. అక్టోబర్​ 14 నాటికి ఈ మైలురాయికి చేరుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పటికే 96 కోట్లకు పైగా కొవిడ్​ వ్యాక్సినేషన్​ జరగ్గా దేశంలోని 48.9 శాతం మంది ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్​ను తీసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. చెడుపై మంచి విజయం సాధించి విజయదశమి జరుపుకొంటున్న వేళ కొవిడ్​ లాంటి రాక్షసిపై భారత్​ విజయం సాధించిన ఘటనగా ఈ 100 కోట్ల మార్క్​ను వేడుకగా జరపాలని ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.

ట్యాగ్స్​