గత ఏడాది జూన్‌లో భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన టిక్‌టాక్‌కు ఇక పూర్తిగా నిషేధించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టిక్‌టాక్ తో పాటు అప్పుడు నిషేధించిన 58 యాప్‌లను శాశ్వతంగా వదిలించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారత యూజర్ల ప్రైవసీ, వారి డేటాకు రక్షణ సంబంధించి ఇప్పటికే ఈ యాప్‌లకు భారత ఐటి మంత్రిత్వ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ కంపెనీల నుంచి వచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో వీటిపై శాశ్వత బ్యాన్‌ను విధించాలనే నిర్ణయానికి వచ్చింది. లడఖ్ సమీపంలో భారత సైనికులపై చైనా కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి 4 గురు జవాన్లను గాయపరిచిన వార్తలు వస్తున్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.