ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.ఎఫ్.7 కేసులు వెలుగుచూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుండి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల నుండి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. బెంగళూరు సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి.