ఇరు జట్లకూ మూడు రోజులే ప్రాక్టీస్​

వారం పాటు చెన్నైలో క్వారంటైన్​

By udayam on January 26th / 11:56 am IST

చెన్నైలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంగ్లాండ్​తో ప్రారంభం కావాల్సిన మొదటి టెస్ట్​కు బిసిసిఐ ప్రణాళికలు రచిస్తోంది.
బుధవారం చెన్నైకు చేరుకోనున్న ఇరు జట్లూ అక్కడ వారం రోజుల క్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్​ ప్రారంభం కావడానికి ముందు కేవలం 3 రోజులు మాత్రమే రెండు జట్లకు ప్రాక్టీస్​ లభించనుంది.

ఇప్పటికే శ్రీలంక పర్యటనను ముగుంచుకున్న ఇంగ్లాండ్​ జట్టు 32 మంది సభ్యులతో కలిసి రేపు ఉదయం చెన్నైలో దిగనుంది.

గత వారమే ఇక్కడకు చేరుకున్న బెన్​స్టోక్స్​, ఆర్చర్​, రోరీ బర్న్స్​తో కలిసి ఇంగ్లాండ్​ జట్టు మొత్తం వారం పాటు క్వారంటైన్​లో ఉండనుంది.