న్యూజిలాండ్​ తో తొలి వన్డే నేడే

By udayam on January 18th / 5:08 am IST

ఉప్పల్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి వన్డే బుధవారం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​ కు భారత జట్టు కీలక ఆటగాడు శ్రేయస్​ అయ్యర్​ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు సూపర్​ ఫాం లోకి వచ్చిన విరాట్​ కోహ్లీ పైనే క్రికెట్​ అభిమానుల కళ్ళన్నీ ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ వద్ద 46 వన్డే సెంచరీలు ఉండగా.. త్వరలోనే సచిన్​ (49 సెంచరీలు) రికార్డును చెరిపేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ట్యాగ్స్​