వర్షార్పణం: భారత్​, న్యూజిలాండ్​ తొలి టి20 రద్దు

By udayam on November 18th / 9:22 am IST

భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ కు వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 ఈ రోజు వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో జరగాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్​ ను అంపైర్లు రద్దు చేశారు. వర్షం తగ్గితే ఐదు ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ఎదురు చూశారు. నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం అయ్యారు.

ట్యాగ్స్​