INDvsSL : ఇక వన్డే సమరం

By udayam on January 10th / 5:16 am IST

శ్రీలంకపై టి20 సిరీస్‌ను నెగ్గిన టీమిండియా ఇక వన్డే సమరంపై దృష్టి సారించింది. మూడో టి20లో సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో టీమిండియా 94పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టి20 2-1తో చేజిక్కించుకున్న భారతజట్టు శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను మంగళవారం ఆడనుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి వన్డేకు గౌహతి ఆతిథ్యమివ్వనుంది. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకూ 162 వన్డేలు జరిగాయి. వీటిలో భారత్‌ అత్యధికంగా 93 మ్యాచుల్లో గెలిచింది. లంక 57 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

ట్యాగ్స్​