తాము కొనుగోలు చేసే చమురు పై బ్యారెల్ ఒక్కింటికీ 70 డాలర్ల ధరకు ఇవ్వాలని భారత్ రష్యాకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో భారత్కు భారీ డిస్కౌంట్తో అమ్ముతామని గతంలో రష్యా ప్రకటించింది. దీంతో భారత్ తన ధరను ఈరోజు వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క బ్యారెల్ చమురు ధర 106 డాలర్లు పలుకుతోంది. దీనినే రష్యా నుంచి 70 డాలర్లకు కొనాలని భారత్ ప్లాన్ చేస్తోంది.