మ్యాచ్​ టై.. సిరీస్​ భారత్​ వశం

By udayam on November 22nd / 11:16 am IST

న్యూజిలాండ్​ తో జరుగుతున్న 3 మ్యాచ్​ ల టి20 సిరీస్​ ను భారత్​ 1–0 తేడాతో సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన 3వ టి20 మ్యాచ్​ వర్షం కారణంగా ఆగిపోవడంతో అంపైర్లు మ్యాచ్​ ను టై గా ప్రకటించారు. న్యూజిలాండ్​ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్​ 9 ఓవర్లకు 75 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్​ లూయిస్​ ప్రకారం భారత్​ సరిగ్గా టై అవ్వడానికి కావాల్సిన పరుగులు చేయడంతో మ్యాచ్​ ను టైగా ప్రకటించారు. దీంతో ఈ సిరీస్​ ను భారత్​ గెలుచుకున్నట్లయింది. సిరాజ్​ కు (4/17) మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డ్​ దక్కింది.

ట్యాగ్స్​