రిపోర్ట్​: గేమింగ్​ లో మునిగితేలుతున్న యువత

By udayam on December 22nd / 11:45 am IST

భారత్​ లో అత్యంత తక్కువ ధరల్లో ఇంటర్నెట్​ దొరుకుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న యువతలో చాలా మంది గేమ్స్​ కు అలవాటు పడుతున్నట్లు మై స్మార్ట్​ ప్రైస్​ సర్వేలో వెల్లడైంది. 14,349 మందిపై జరిగిన ఈ సర్వేలో 42.7 శాతం మంది కేవలం గేమింగ్​ కోసమే ఇంటర్నెట్​ ను వాడుతున్నట్లు తెలిపారు. వీరిలో 19–24 ఏళ్ళ మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. వీరి తర్వాత 16–18 ఏళ్ళ వయసు వారిలోనూ గేమింగ్​ ఎక్కువగా ఆడుతున్నారని, 30+ వయసు వారిలో కేవలం 4.6 శాతం మంది మాత్రమే గేమ్స్​ ఆడుతున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్​