వాయుకాలుష్య దేశాల జాబితాలో భారత్​కు 2వ స్థానం

By udayam on September 25th / 7:48 am IST

ప్రపంచంలోని వాయు కాలుష్యం తీవ్రంగా దేశాల జాబితాలో మన దేశానికి 2వ స్థానం దక్కింది. ప్రస్తుతం దేశంలో ఉన్న వాయు కాలుష్యానికి ప్రజల ఆయుర్ధాయం సరాసరి 5.2 ఏళ్ళ చొప్పున తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలో నివసించే వారి జీవిత కాలం 9.4 ఏళ్ళు, ఉత్తర ప్రదేశ్​లో 8.6 సంవత్సరాలు జీవితం తగ్గిపోనుందని ప్రకటించింది. భారత్​ స్వయంగా నిర్ధేశించుకున్న వాయు కాలుష్య పరిమితులకు కాలుష్యాన్ని తగ్గించినా సరే 2.3 ఏళ్ళ వరకూ సగటున భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోతుందని ప్రకటించింది.

ట్యాగ్స్​