రోడ్డు ప్రమాదంలో క్రికెటర్​ రిషబ్​ పంత్​ కు తీవ్ర గాయాలు

By udayam on December 30th / 4:51 am IST

భారత యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్​ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన తలకు, నడుం, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగినట్లు ఎక్స్​ రేలో కనిపిస్తోంది. అతడి కారు డివైడర్​ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత కారు మంటల్లో చిక్కుకోగా పంత్​ ఎలాగోలా కారు నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ–డెహ్రాడూన్​ హైవే పై హమ్మద్​ పూర్​ జల్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్​