నేపాల్లోని మౌంట్ కాంచెన్గంగను అధిరోహిస్తున్న సమయంలో భారతీయ పర్వతారోహకుడు మరణించాడు. మహారాష్ట్రకు చెందిన 52 ఏళ్ళ నారాయణన్ అయ్యర్ గురువారం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం కాంచెన్ గంగ పైన 8,200 మీటర్ల ఎత్తులో మరణించాడని ఈ ప్రయోగానికి డైరెక్టర్గా ఉన్న నివేక్ కర్కి తెలిపారు. ఆ పర్వతం అసలు ఎత్తు 8,583 మీటర్లు కాగా.. 8,200 మీటర్ల ఎత్తులో తలెత్తిన హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కారణంగా ఆయన మరణం సంభవించిందని తెలిపారు.