ఆస్ట్రేలియాలో హత్య.. 4 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో దొరికిన నర్స్​

By udayam on November 25th / 9:08 am IST

నాలుగేళ్ళుగా ఆస్ట్రేలియా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ మేల్​ నర్స్​ ను ఢిల్లీ పోలీసులు భారత్​ లో అరెస్ట్​ చేశారు. రజవీందర్​ సింగ్​ అనే ఈ 37 ఏళ్ళ వ్యక్తి ఆస్ట్రేలియాలో నర్స్​ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు 2018 అక్టోబర్​ 21న అక్కడి క్వీన్స్​ లాండ్​ లోని ఓ బీచ్​ లో 24 ఏళ్ళ మహిళను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హత్య జరిగిన 2 రోజుల తర్వాత అతడు భారత్​ కు పారిపోయి వచ్చి దాక్కున్నాడు. దీంతో ఆసీస్​ పోలీసులు ఢిల్లీ పోలీసుల సాయం తీసుకుని అతడిని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే అతడిని తాజాగా అరెస్ట్​ చేశారు. అతడి ఆచూకీపై ఆసీస్​ పోలీసులు రూ.5 కోట్ల నజరానా కూడా ప్రకటించారు.

 

ట్యాగ్స్​