సిఐఎ చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​గా భారతీయుడు

By udayam on May 3rd / 11:24 am IST

అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ (సిఐఎ) చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​గా భారతీయ అమెరికన్​ నంద్​ మూల్​ చందనీ నియమితులయ్యారు. ఈ మేరకు సిఐఏ డైరెక్టర్​ విలియం జె బర్న్స్​ ప్రకటన విడుదల చేశారు. సిలికాన్​ వ్యాలీలోనూ, అమెరికా రక్షణ శాఖలోనూ దాదాపు 25 ఏళ్ళ అనుభవం ఉన్న నంద్​ మూల్​ చందనీ.. అంతకు ముందు అమెరికా రక్షణ శాఖలోని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ విభాగంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్​గా, ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా పనిచేశారు.

ట్యాగ్స్​