విరాట్​ లేకపోతే మరింత స్వేచ్ఛగా ఆడతారు

కోహ్లీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గవాస్కర్​

By udayam on November 21st / 2:25 pm IST

ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న టెస్ట్​ సిరీస్​లో విరాట్​ చివరి మూడు టెస్టులకు దూరం కానున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై మాజీ భారత కెప్టెన్​ సునీల్​ గవాస్కర్​ స్పందించాడు.

విరాట్​ గైర్హాజరీతో భారత ప్లేయర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని వ్యాఖ్యానించాడు. విరాట్​ లేకుండానే భారత్​ ఇటీవల కాలంలో చాలా మ్యాచుల్లో విజయాన్ని అందుకుందని వారికి మరింత స్వేచ్ఛ లభించే అవకాశం ఇప్పుడొచ్చిందని పేర్కొన్నాడు.

‘‘మీరు ఆస్ట్రేలియాతో ధర్మశాలలో ఆడిన టెస్ట్​ను కానీ, ఆఫ్ఘనిస్తాన్​తో ఆడిన టెస్ట్​, నిదహాస్​ ట్రోఫీ, ఆసియా కప్​లను ఉదాహరణలుగా తీసుకోండి. వీటిల్లో విరాట్​ కోహ్లీ ఆడలేదు. కానీ భారత్​ గెలిచింది. విరాట్​ లేని సమయాన్ని భారత ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఆడటానికి వినియోగిస్తున్నారు. ఇదే ఆస్ట్రేలియాలో సైతం చేస్తారు” అని గవాస్కర్​ వివరించాడు.

విరాట్​ గైర్హాజరీతో మిగతా టెస్ట్​లకు కెప్టెన్​గా వ్యవహరించే అజింక్యా తన బ్యాటింగ్​ను సైతం మెరుగుపరుచుకోగలగుతాడని గవాస్కర్​ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద పుజారా, అంజిక్యా రహానేలే భారత్​ ఆపద్భాందవులుగా మారతారని ఆయన జోస్యం చెప్పాడు.