హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మూతపడ్డ ఎన్టీఆర్‌ మార్గ్‌

By udayam on November 18th / 8:30 am IST

శని, ఆదివారాల్లో రెండురోజులపాటు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు జరనున్న వేళ … హైదరాబాద్‌ నగరంలోని పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉత్కంఠభరితమైన రేసింగ్‌ లీగ్‌కు నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరం సిద్ధమయ్యింది. ట్రాఫిక్‌ జాయింట్‌ సిపి రంగనాథ్‌ మాట్లాడుతూ … శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. రేసింగ్‌ పోటీలు జరుగనుండగా, ట్రాక్‌ పనులు చేసేందుకు నేటి నుంచే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ట్రాక్‌ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్​