మరో 10 వందేభారత్​ రైళ్ళు

By udayam on July 21st / 10:02 am IST

మరో 10 స్వదేశీ తయారీ వందేభారత్​ ట్రైన్లను వచ్చే ఏడాది ఆగస్ట్​ నాటికి రైల్వేలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ సెమీ హై స్పీడ్​ ట్రైన్లను దేశవ్యాప్తంగా ఉన్న 40 పట్టణాలకు సేవలందించేలా వీటిని శరవేగంతో రైల్వేస్​ తయారు చేస్తోంది. 2024 నాటికి మొత్తం 100 వందేభారత్​ ట్రైన్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. శతాబ్ది, రాజధాని ట్రైన్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించనున్న వీటి సాయంతో ప్రయాణ సమయం చాలా వరకూ కలిసిరానుంది.

ట్యాగ్స్​