భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా యుకెలో ఉన్న అతడు ఈ మేరకు భావోద్వేగంతో పోస్ట్ చేశాడు. ‘ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. ఈ మరపురాని జర్నీని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నా జీవితాంతం గుర్తుంచుకునే జర్నీ ఇది. నా ఫేవరెట్ బ్లూ జెర్సీలో 15 ఏళ్ళు ఉంటానని కలలో కూడా అనుకోలేదు. క్రికెట్‌ను ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు’ అని చెప్పాడు.
𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc
— Rohit Sharma (@ImRo45) June 23, 2022