కొత్త ఏడాదిలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈరోజు శ్రీలంకతో ఆడనుంది. హార్ధిక్ పాండ్య కెప్టెన్ గా ఉండనున్న ఈ జట్టులో రోహిత్, ధావన్, కోహ్లీ, రాహుల్ లకు విశ్రాంతిని ఇచ్చారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి ఈ ఏడాదికి శుభారంభం ఇవ్వాలని మన యువ క్రికెట్ టీం ఉవ్విళ్ళూరుతోంది. యువ ఆటగాళ్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్ తొలి సారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు వన్డేలు, టెస్టులలో అదరగొడుతున్న యవ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.