సెల్ఫీల్లో మనవాళ్ళే క్వీన్లు

సెల్ఫీలకు ఫిల్టర్లు జతచేయడంలోనూ భారత్​దే అగ్రస్థానమంటున్న గూగుల్​

By udayam on November 20th / 11:57 am IST

సెల్ఫీలు దిగడంలోనూ, వాటికి ఫిల్టర్లు జతచేయడంలోనూ భారతీయ మహిళలదే అగ్రస్థానమని గూగుల్​ నివేదిక వెల్లడించింది.

అమెరికాతో సమానంగా భారతీయులు ఈ లిస్ట్​లో అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్​ తెలిపింది. ఇప్పుడు భారతీయ మహిళలకు సెల్ఫీలు తీయడం అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయిపోయిందని గూగుల్​ పేర్కొంది.

అయితే జర్మనీ వాసులు తమ పిల్లల ఫొటోలకు ఫిల్టర్లు జత చేస్తుంటే, దక్షిణ కొరియా ప్రజలు మాత్రం మరింత అందంగా కనబడడానికి ఫిల్టర్లు ఉపయోగిస్తున్నట్లు గూగుల్​ నివేదిక బయటపెట్టింది.

ఆండ్రాయిడ్​ యూజర్లు దాదాపు 70 శాతానికి పైగా ఫ్రంట్​ ఫేసింగ్​ కెమెరాను ఉపయోగిస్తున్నారని, దాంతోనే 90 శాతం వరకూ సెల్ఫీలు దిగుతున్నట్లు గూగుల్​ పేర్కొంది.

‘‘భారతీయ మహిళలు, మరీ ముఖ్యంగా వయసు కంటే పెద్దగా కనిపించే వారు ఈ ఫిల్టర్లు యూజ్​ చేస్తున్నట్లు మేం గుర్తించాం. పిక్స్​ఆర్ట్​, మేకప్​ప్లస్​, స్నాప్​చాట్​లలోని ఫిల్టర్లను 29 ఏళ్ళ వయసుకంటే తక్కువ ఉన్న వారు ఎక్కువగా యూజ్​ చేస్తున్నారు” అని గూగుల్​ నివేదిక బయటపెట్టింది.