రోజుకు సరాసరి 7.3 గంటల పాటు భారతీయులు ఫోన్స్ లోనే కాలం గడిపేస్తున్నారని రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సంస్థ తన లేటెస్ట్ నివేదికను వెల్లడించింది. ఈ లెక్కన మనవాళ్ళు చైనీయులు, అమెరికన్లను కూడా దాటేసినట్లు వెల్లడించింది. మనవాళ్ళు ఎక్కువగా ఆన్ లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్ స్ట్రీమింగ్, ఓటిటి కంటెంట్, షార్ట్ ఫార్మ్ వీడియో ల కోసమే మొబైల్ ను వాడుతున్నారని పేర్కొంది. అమెరికన్లు రోజుకు 7.1 గంటలు, చైనీయులు రోజుకు 5.3 గంటలు మొబైల్ ను వాడుతుంటే.. థాయిలాండ్ వాసులు మనవాళ్ళను మించిపోయి రోజుకు 9.1 గంటల పాటు మొబైల్ లోనే ఉంటున్నారట.