రీసెర్చ్​: భారత్​ లో వచ్చే ఏడాది 4జి మార్కెట్​ ను దాటేయనున్న 5జి స్మార్ట్​ ఫోన్లు

By udayam on December 30th / 9:11 am IST

భారత్​ లో వచ్చే ఏడాది 5జి హ్యాండ్​ సెట్ల అమ్మకాలు జోరందుకోనుందని కౌంటర్​ పాయింట్​ సంస్థ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సంస్థలు 5జి సేవల్ని విరివిగా అందుబాటులోకి తేనున్న నేపధ్యంలో 4జి ఫోన్ల కంటే 5జి హ్యాండ్​ సెట్ల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపనున్నట్లు తెలిపింది. తక్కువ ధరకే దొరికే 5జి హ్యాండ్​ సెట్లకు భారీ డిమాండ్​ ఏర్పడనుందని తెలిపింది. ఈ ఏడాది భారత స్మార్ట్​ ఫోన్​ మార్కెట్​ గతేడాదితో పోల్చితే తగ్గిందన్న ఆ సంస్థ.. ఈ లోటును వచ్చే ఏడాది 5జి హ్యాండ్​ సెట్ల అమ్మకాలు భర్తీ చేస్తుందని తెలిపింది.

ట్యాగ్స్​