50 వేల ఏళ్ళకోసారి కనిపించే తోకచుక్కను ఫొటో తీసిన భారత టెలిస్కోప్​

By udayam on January 11th / 10:21 am IST

50 వేల సంవత్సరాలకు ఒక్కసారి కనిపించే అతిపెద్ద తోకచుక్కను భారత్​ కు చెందిన చంద్ర టెలిస్కోప్​ ఫొటోలు తీసింది. ఇండియణ్​ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ ఆస్ట్రోఫిజిక్స్​ ఆధ్వర్యంలో నడిచే ది హిమాలయన్​ చంద్ర టెలిస్కోప్​ సాయంత్రం Comet C/2022 E3 ఫొటోల్ని తీశారు. సౌర కుటుంబం లోపలే తిరిగే ఇది ఫిబ్రవరి 1న భూమికి 42 మిలియన్ల కిలోమీటర్ల సమీపానికి రానుంది. ఎరుగు, గ్రీన్​, బ్లూ ఫిల్టర్స్ తో కనిపించే ఈ తోక చుక్క ఎప్పటికీ మన సౌర కుటుంబంలోనే ఉండిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్​