బొగ్గు ఉత్పత్తిలో 28 శాతం వృద్ధి

By udayam on May 3rd / 11:39 am IST

ఎండాకాలంలో థర్మల్​ విద్యుత్​కు డిమాండ్​ పెరిగిన నేపధ్యంలో భారత్​ తన బొగ్గు ఉత్పత్తిలో 28 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఏప్రిల్​ నెలలో 66.1 మెట్రిక్​ టన్నుల మేర బొగ్గు ఉత్పత్తిని సాధించింది. ‘గడిచిన ఏప్రిల్​లో మొత్తం 661.54 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది’ అని బొగ్గు శాఖ ప్రకటించింది. సింగరేణి కాలరీస్​ నుంచి 5.3 మెట్రిక్​ టన్నులు, కేప్టివ్​ మైన్స్​ నుంచి 7.3 మెట్రిక్​ టన్నులు, కోల్​ ఇండియా నుంచి 53.4 మెట్రిక్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.

ట్యాగ్స్​